అనకాపల్లి జిల్లా కేంద్రంలోని అచ్యుతరాపురంలో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. సెజ్‌లోని పోరస్ కంపెనీ నుంచి అమ్మోనియం గ్యాస్ లీక్ అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాలకు చెందిన 30 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై వాంతులు, కళ్లు తిరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితులను యలమంచిలి, అనకాపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ప్రభుత్వం 20 అంబులెన్స్‌లతో సహాయక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ రవి సుభాష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
హోంమంత్రి తానేటి వనిత అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై ఆరా తీశారు. సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ పీల్చి ఇబ్బందిపడ్డ 32 మంది బాదితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. గ్యాస్ లీక్ అవుతున్న పరిశ్రమని అధికారులు కంట్రోల్ లోకి తీసుకోవాలని ఆదేశించారు.