అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

పెనమలూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ కొలుసు పార్థసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat
Published on : 12 Jan 2024 6:48 PM IST

అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

పెనమలూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ కొలుసు పార్థసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని.. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడమే నా అసమర్థతా.? అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా.? అని వైసీపీ అధిష్టానాన్ని ప్ర‌శ్నించారు. వైసీపీలో బీసీలకు అగ్రతాంబూలం అనేది నేతి బీరకాయలో నెయ్యి చందమేన‌ని అధిష్టానంపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.

పెనమలూరు నుంచి తనను కాద‌ని వైసీపీ గెలిచే పరిస్ధితి లేని గన్నవరం సీటుకు వెళ్లమన్నారని పార్ధసారధి వెల్లడించారు. తాను బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా ఫర్వాలేదని అనుకున్నట్లున్నారన్నారు. కానీ తాను ఇందుకు ఒప్పుకోలేదన్నారు. బలహీన వర్గాలకు వైసీపీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పాను.. అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదన్నారు. బీసీలు, ఎస్సీలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారని.. వారు మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే నాలా ఆత్మాభిమానం చంపుకోరని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Next Story