మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు
సొంత నియోజకవర్గంలో మంత్రి రోజాకు వ్యతిరేకంగా గళం వినిపిస్తూ ఉంది.
By Medi Samrat Published on 23 Jan 2024 1:45 PM GMTసొంత నియోజకవర్గంలో మంత్రి రోజాకు వ్యతిరేకంగా గళం వినిపిస్తూ ఉంది. అది క్రమంగా ఎక్కువవుతోంది. నగరి నియోజకవర్గ జడ్పీటీసీలు భవనాలు ఉన్నా తమకు కార్యాలయాలను కేటాయించడం లేదని విమర్శించారు. ఇదే విషయంపై చిత్తూరు జడ్పీటీసీ సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్ ను నిలదీశారు. అభివృద్ధి కార్యక్రమాలను కూడా రోజా అడ్డుకుంటున్నారని.. రోజాకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని ముఖ్యమంత్రి జగన్ ను డిమాండ్ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం రోజా రూ. 70 లక్షలు డిమాండ్ చేశారని పుత్తూరు వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. రోజా సోదరుడు కుమారస్వామిరెడ్డికి మూడు విడతల్లో రూ. 40 లక్షలు ఇచ్చానని, చైర్మన్ పదవి ఇవ్వకపోగా, ఇచ్చిన డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. రోజా సోదరుడు కుమారస్వామిరెడ్డి పంపిన సత్య అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చానని తెలిపారు. దీనిపై మంత్రి రోజాకు మెసేజ్ చేస్తే కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీ కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని, రిజర్వేషన్ కూడా ఉండడంతో చైర్మన్ పదవి నీదేనని నమ్మించారని భువనేశ్వరి ఆరోపించారు.