గుడ్‌న్యూస్: రేపే అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు రెండో విడత తల్లికి వందనం డబ్బులను విడుదల చేయనుంది.
By Knakam Karthik
గుడ్‌న్యూస్: రేపే అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు రెండో విడత తల్లికి వందనం డబ్బులను విడుదల చేయనుంది. 9.51 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం నిధులు జమ చేయనుంది. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్‌ఈ, నవోదయల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనూ రెండో విడతలో తల్లికి వందనం నిధులు అందుతాయి. ఇటీవల వీరిని మినహాయించి మిగిలిన వారికి డబ్బులు జమ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే మొదటి విడతలో అర్హుల జాబితాలో ఉన్నా ఒకే కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉన్నవారు, ఆధార్ నంబర్లు సరిగా నమోదుచేయని సుమారు లక్ష మందికి గత నెలలో జమను పెండింగ్‌లో ఉంచారు. వారికి కూడా ఇప్పుడు విడుదల చేయనున్నారు. విద్యాహక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన 46 వేల మంది విద్యార్థుల నగదును వారి తల్లులకు కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించనున్నారు. మొత్తం 11 లక్షల మంది వివరాలను పాఠశాల విద్యాశాఖ సచివాలయాల శాఖకు పంపింది. అర్హతల వడపోత అనంతరం సుమారు 10 లక్షల మందికి పథకం అందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.