అమరావతి రాజధానిలో రెండో విడత భూసమీకరణ ప్రారంభమైంది. మంత్రి నారాయణ గుంటూరు జిల్లా వడ్డమానులో ల్యాండ్ పూలింగ్ 2.0 ను ప్రారంభించారు. రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన సీఆర్డీఏ యూనిట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
కాగా ఈ విడతలో రైతుల నుంచి సీఆర్డీఏ 16,666 ఎకరాలను సమీకరించనుంది. తుళ్లూరు, అమరావతి, మండలాల్లోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి రైతుల నుంచి భూమిని సేకరించనున్నారు. ఎయిర్ పోర్టు, స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం ఈ భూములు అవసరమని ప్రభుత్వం చెబుతోంది.