స్కూళ్లకు మూడు రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లకు మూడు రోజులు సెలవులు రానున్నాయి.

By అంజి  Published on  19 Feb 2024 7:00 AM IST
Schools, Telugu states, holidays, Telangana, AndhraPradesh

స్కూళ్లకు మూడు రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి కాగా.. ఆ తర్వాత 9వ తేదీ రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు వస్తుండటంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో వీటితో పాటు మార్చి నెలలో మరో రెండు రోజులు సెలవులు కూడా రానున్నాయి. మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్‌ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులు ఉండనున్నాయి. అలాగే ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5న, ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న, ఈద్ ఉల్ ఫితర్(రంజాన్) సందర్భంగా ఏప్రిల్ 11న, శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవులు రానున్నాయి. ఆ తర్వాత సమ్మర్‌ హాలీడేస్‌ వస్తాయి. జూన్ నెల 17వ తేదీన బక్రీద్ సందర్భంగా సెలవు రానుంది.

Next Story