'ఆడుజీవితం' రిపీట్.. వీరేంద్రను రక్షించిన ఏపీ ప్రభుత్వం
ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఇబ్బందులు పడ్డ వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఆడుజీవితం' సినిమా.. నిజజీవితంలో రిపీట్ అయ్యింది.
By అంజి
'ఆడుజీవితం' రిపీట్.. వీరేంద్రను రక్షించిన ఏపీ ప్రభుత్వం
ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఇబ్బందులు పడ్డ వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఆడుజీవితం' సినిమా.. నిజజీవితంలో రిపీట్ అయ్యింది. సౌదీ అరేబియా ఎడారిలో కష్టాలు పడుతున్నానంటూ కోనసీమకు చెందిన వీరేంద్ర ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. ఖతర్ అని చెప్పి తీసుకెళ్లి తనను ఎడారిలో పడేశారని, తన ఆరోగ్యం బాగా లేదని వీరేంద్ర వీడియోలో తెలిపాడు. తనను ఎలాగైనా అక్కడి నుంచి బయటపడేయాలంటూ వేడుకున్నాడు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. ఎన్‌ఆర్‌ఐ టీడీపీని అలర్ట్ చేశారు. తాజాగా ఆ టీమ్ వీరేంద్రను కాపాడి స్వదేశానికి పంపింది. వీరేంద్రది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇసుకపూడి.
Successfully repatriated Veerendra Kumar Sarella from Saudi Arabia. Thank you 🙏 @naralokesh pic.twitter.com/xzQrfhvgWX
— Bhavya🦩 (@unexpected5678) July 26, 2024
నారా లోకేష్ ఆదేశాలతో ఇటీవల శివ అనే వ్యక్తిని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సేవ్ చేసిన విషయం తెలిసిందే. కువైట్ బాధితుడు శివ స్వగ్రామం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన అతడు అష్ఠకష్టాలు పడుతున్నానని, కాపాడాలంటూ ఇటీవల ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో స్పందించిన మంత్రి లోకేష్.. శివను క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చారు.
ఆడుజీవితం
మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం 'ఆడుజీవితం (ది గోట్ లైఫ్)'. ఈ సినిమా రిలీజైన 25 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లకుపైగా వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటనకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి.