జీతాలు పెంచండి.. మాకంటే వాలంటీర్లకు, ఆయాలకే ఎక్కువ వేతనం

Sarpanchs demand to increase salaries. ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్రస్థాయి భేటీ నేడు జరిగింది.

By Medi Samrat
Published on : 27 Dec 2022 4:42 PM IST

జీతాలు పెంచండి.. మాకంటే వాలంటీర్లకు, ఆయాలకే ఎక్కువ వేతనం

ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్రస్థాయి భేటీ నేడు జరిగింది. ఈ సమావేశంలో ఆయా సంఘాల నేతలు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. కేంద్రం పంపిన 14వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ.8,660 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని కోరారు. సర్పంచుల కంటే వాలంటీర్లకు, ఆయాలకే ఎక్కువ వేతనం అందుతోందని.. సర్పంచ్, ఎంపీటీసీలకు రూ.15 వేల గౌరవవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ, జడ్పీటీసీలకు రూ.30 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లకు రూ.20 వేలు, కార్పొరేటర్లకు రూ.30 వేలు, మున్సిపల్ చైర్మన్ కు రూ.1 లక్ష, జడ్పీ కార్పొరేషన్ చైర్మన్లకు రూ.2 లక్షలు గౌరవ వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.


Next Story