తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో రప్పా..రప్పా కేసుకు సంబంధించి కేవీబీపురం సర్పంచ్ గిరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల జరిగిన మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా కేవీబీ పురం లో వైసిపి నేత, కేవీపీ పురం సర్పంచ్ గిరి పొట్టేలును నరికి ఆ రక్తంను జగన్ ఫ్లెక్సీలకు అంటించి రక్తాభిషేకం చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పబ్లిక్ ప్లేస్ లో మూగజీవాలను వేట కత్తులతో నరికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసారని కొందరు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కేవీబీపురం ఎస్ఐ ఓబయ్య సర్పంచ్ గిరి తో పాటు అతని అనుచరులు మురళీ అలియాస్ భాష, శ్రీధర్ అనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సర్పంచ్ గిరి అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు గిరికిమద్దతు తెలుపుతూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.