తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు సెలవులు ఇచ్చారు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సెలవులు ఇవ్వగా.. తిరిగి 17వ తేదీన కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపింది.
తెలంగాణలో స్కూళ్లకు జనవరి 12 నుంచి 17 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించారు. మిషనరీ పాఠశాలలకు మినహా అన్ని విద్యాసంస్తలకు ఈ సెలవులు వర్తిస్తాయని పాఠశాల విద్యాడైరెక్టర్ వెల్లడించారు. జనవరి12న ఆప్షనల్ హాలిడే 13 తేదిన రెండోశనివారం చాలా స్కూళ్లకు హాలిడే. అలాగే 14న భోగి పండుగ, 15న సోమవారం సంక్రాంతి సాధారణ హాలిడే ఉంటుంది. అలాగే జనవరి 16న కనుమ హాలిడే ఇచ్చారు.