కావాలనే టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: సజ్జల
చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు.
By Medi Samrat Published on 9 Sep 2023 6:15 AM GMTచంద్రబాబు నాయుడు అరెస్టుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్ స్కాంలో రాజకీయ దురుద్దేశాలతో చంద్రబాబు నాయుడును అరెస్టు చేయలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఎలాంటి దురుద్దేశాలు లేకుండా పాదర్శకంగా జరిగిన దర్యాప్తులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారని అన్నారు. చంద్రబాబుపై కేసు ఇప్పుడే నమోదు కాలేదని, 9 డిసెంబరు 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నట్టు సిట్ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. తనపై నేరారోపణ బలంగా ఉందని, అరెస్ట్ చేస్తారని కూడా చంద్రబాబుకు తెలుసని అన్నారు. తనకు నోటీసు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని చంద్రబాబు చెబుతున్నారని, కాగ్నిజబుల్ అఫెన్స్, ఆర్థిక నేరాల్లో నోటీసు ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం అక్రమంగా రిలీజ్ చేసిన రూ.370 కోట్లలో రూ. 241 కోట్లు షెల్ కంపెనీల ద్వారా డైవర్ట్ అయినట్టు జీఎస్టీ ఇంటెలిజెన్స్ పేర్కొందని అన్నారు సజ్జల. ఎఫ్‌ఐఆర్ లేదు, నోటీసులు లేదని టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని అన్నారు. అన్నీ తెలిసే రెండు మూడు రోజుల నుంచి అరెస్ట్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదంటూ దబాయిస్తున్నారు. రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ, ఈ కేసు చాలా బలంగా ఉంది. ఇది రాత్రికి