పాల్, పవన్‌ కల్యాణ్ ఎవరైనా రావొచ్చు : సజ్జల

Sajjala Ramakrishnareddy Fire on Pawan Kalyan. చంద్రబాబు ఏజెంట్‌గా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు

By Medi Samrat
Published on : 19 Dec 2022 2:17 PM IST

పాల్, పవన్‌ కల్యాణ్ ఎవరైనా రావొచ్చు : సజ్జల

చంద్రబాబు ఏజెంట్‌గా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. జగన్‌ను మళ్లీ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. పాల్, పవన్‌ కల్యాణ్ ఎవరైనా రావొచ్చు.. ప్రచారం చేసుకోవచ్చని అన్నారు. పవన్ ఆలోచనంతా చంద్రబాబు గురించేన‌ని కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని అన్నారు. అన్ని కులాల వారిని రాజ్యాధికారంలో ఎలా భాగం చేయొచ్చనేది సీఎం జగన్ ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్నారని వివ‌రించారు. చంద్రబాబు తరపున పని చేస్తున్నానని పవన్ చెప్పాలని అన్నారు. మాచర్లలో చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బయట పడిందని.. బ్రహ్మారెడ్డిని చంద్రబాబు తెచ్చి పెట్టిందే గొడవలు సృష్టించడానికి అని అన్నారు. వాళ్లే లా అండ్ ఆర్డర్‌ ప్రాబ్లమ్‌ క్రియ్ ట్ చేస్తారు. వాళ్లే ప్రాబ్లమ్ అంటూ అరుస్తారు. మాచర్లను అగ్ని గుండంలా.. తయారు చేయాలనేది చంద్రబాబు ప్రయత్నం అని విమ‌ర్శించారు.


Next Story