ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కుతోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ రమేష్‌ అన్ని హద్దులు దాటారు. సంస్కార హీనుడుగా వ్యవహరిస్తున్నారు. నిమ్మగడ్డ ఎలా ఐఏఎస్‌ అయ్యారో తెలియడం లేదంటూ సజ్జల ఎద్దేశా చేశారు.

2019 మార్చిలో నిమ్మగడ్డ అన్నీ వదిలేశారు. మేం ఎక్కడా గీత దాటడం లేదు. ఎన్నికలు సజావుగా జరపడం ఎస్‌ఈసీ బాధ్యత. ఏ ఎన్నికలైనా నియమ నిబంధనల ప్రకారమే జరుగుతాయి. ఎస్‌ఈసీ స్థానంలో ఉన్నవారరు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. కానీ నిమ్మగడ్డ రమేష్‌ నియంత్రణ కోల్పోయి వ్యవహరిస్తున్నాంటూ సజ్జల వ్యాఖ్యానించారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పరిధి దాటి అధికారులపై చర్యలకు ఆదేశిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏజెంటుగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ.. ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను నమ్మకపోతే ఏలా..? టీడీపీ గుండాలను పెట్టుకుని ఎన్నికలు జరుపుతారా..? ఇది మీ వ్యక్తిగత రాజ్యాంగమా..? అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

కాగా, ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరింత రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు ఇప్పుడు నిర్వహించరాదని, కరోనా సమయంలో ఎన్నికలకు వెళ్లడం సరైంది కాదని ప్రభుత్వం వాదిస్తున్నా.. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆవేమి పట్టించుకోకుండా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో ప్రతిపక్షాల కుట్రలతోనే రాష్ట్రంలో ఇలా జరుగుతున్నాయంటూ ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య వార్‌ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు దిగుతున్నారు.


సామ్రాట్

Next Story