టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను చూస్తే జాలేస్తోంది : సజ్జలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని.. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్‌కు లేవన్నారు. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని.. సొంతంగా బలం లేదని పవన్ ఒప్పుకుంటున్నారన్నారు. పవన్ కంటే ఆయన అభిమానులను చూస్తే జాలేస్తోందని తెలిపారు సజ్జల.
వందకు 100 శాతం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పవన్ కళ్యాణ్ నడుస్తున్నారనేది మరోసారి తేలిపోయిందని అన్నారు సజ్జల. టీడీపీ-జనసేన ఎన్ని జిమ్మిక్కులు చేసినా 87 శాతం జగన్ గారి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని అన్నారు. కుప్పంలో కూడా విజయం వైపు మేం అడుగులు వేస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీగా పేరు పెట్టుకుని, తన సామాజికవర్గాన్ని, అభిమానుల్ని ఇలా మోసం చేయడం దారుణమన్నారు. పవన్ కల్యాణ్ సొంత పార్టీని వదిలేసి టీడీపీ ఉపాధ్యక్షుడో, రాష్ట్ర అధ్యక్షుడో తీసుకుని ఉంటే సరిపోయేదనిపిస్తోందని సజ్జల సెటైర్లు వేశారు.