వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా.. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక మాఫియాను తయారు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారని అన్నారు. మా పార్టీలో అవకాశం దక్కని వారు బయటకు వెళ్తున్నారని.. గుమ్మనూరి జయరాం రాజీనామా చేస్తే.. ఆయన్ను టీడీపీ చేర్చుకుంటూ ఉందన్నారు. జయరాం అక్రమాలు చేశారంటూ చంద్రబాబు తన అనుకూల ప్రచారం చేశారని.. మరి ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు కావాలో చెప్పాలన్నారు సజ్జల. కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలపై హామీలను ఇస్తున్నారు. జగన్ చేసినవన్ని తానే చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు.
2014-19 మధ్య చంద్రబాబు ప్రజలకు ఏమి చేశారు.. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా గ్యాంగ్‌ని తయారు చేశారని విమర్శించారు సజ్జల. రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్ చేశారు. ప్రజలు 2019లో చంద్రబాబుని సాగనంపారన్నారు. సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు 70శాతం పదవులు ఇచ్చారుని.. అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు సజ్జల.