చంద్రబాబు ముడుపుల వ్య‌వ‌హారం తేల్చేది వైసీపీ కాదు : సజ్జల

తెలుగు దేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు

By Medi Samrat  Published on  6 Sept 2023 8:13 PM IST
చంద్రబాబు ముడుపుల వ్య‌వ‌హారం తేల్చేది వైసీపీ కాదు : సజ్జల

తెలుగు దేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు తేల్చేది వైఎస్సార్‌సీపీ కాదని, ఐటీ శాఖ అనే విషయం ఆయనే తెలుసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఐటీకీ సమాధానం చెప్పాల్సింది పోయి తనను రెండు, మూడు రోజుల్లో అరెస్ట్‌ చేస్తారంటూ చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారన్నారు. దోపిడీ చేసి, తాను నిజాయితీ పరుడైనట్లు చిత్రీకరించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఈడీ కూడా విచారణ జరిపి చంద్రబాబును అరెస్టు కూడా చేయాల్సింది.. కానీ ఇంతకాలం ఎందుకు చూస్తూ ఊరుకుందో అర్థం కావటం లేదన్నారు. ముడుపులన్నీ ఎటుఎటు తిరిగి చంద్రబాబు గూటికి చేరాయో ఐటీ శాఖ వివరంగా ఆ నోటీసుల్లో పేర్కొందన్నారు సజ్జల.

తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి చంద్రబాబు అని సజ్జల అన్నారు. పాపం పండినప్పుడు చంద్రబాబును అరెస్టు చేయటం ఖాయమన్నారు. ఐటీ ముడుపుల కేసులో దోషి అని తేలితే శిక్ష తప్పదు. బాబు నిప్పులాంటి వ్యక్తి కాదు.. తుప్పు లాంటి వ్యక్తని అన్నారు. తాను చట్టానికి అతీతుడు అయినట్లు చంద్రబాబు మాట్లాడటం బరితెగింపు కాక మరేంటని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చి సీఎం జగన్‌పై బురద జల్లడమే ఎల్లోమీడియా విధానమన్నారు.

Next Story