సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారా.?

పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులు జరుగుతూ ఉండడంతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.

By Medi Samrat  Published on  12 Nov 2024 7:35 PM IST
సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారా.?

పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులు జరుగుతూ ఉండడంతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియాలో కీలక వ్యక్తి, జగన్ కు దగ్గరి బంధువు అర్జున్ రెడ్డిల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని తెలుస్తోంది.

సజ్జల భార్గవరెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కడప పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబరు 8వ తేదీన వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైఎస్సార్ జిల్లాకు చెందిన హరి అనే దళితుడి ఫిర్యాదు ఆధారంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. భార్గవరెడ్డిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులు ఉన్నాయి.

Next Story