రిపబ్లిక్ సినిమా బాయ్ కాట్ చేస్తున్నారట

Sai Dharam Tej Republic Movie Boycott. సాయి ధరమ్ తేజ్ హీరోగా.. దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన సినిమా రిపబ్లిక్..! ఈ సినిమా

By Medi Samrat  Published on  2 Oct 2021 6:42 PM IST
రిపబ్లిక్ సినిమా బాయ్ కాట్ చేస్తున్నారట

సాయి ధరమ్ తేజ్ హీరోగా.. దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన సినిమా రిపబ్లిక్..! ఈ సినిమా యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదాస్పదం అయింది. అయితే తాజాగా ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తూ ఉన్నామంటూ కొందరు మీడియా ముందుకు వచ్చారు. ప‌వ‌న్ కళ్యాణ్ వ్యాఖ్య‌ల‌ను వ్యతిరేకిస్తూ, జగన్ అభిమానులు రిప‌బ్లిక్ సినిమాను బాయ్ కాట్ చేయాల‌ని పిలుపునిస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో రిపబ్లిక్ సినిమాను బహిష్కరించాలని కోరుతూ, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పిలుపునిచ్చారు.

రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ వేదికపై వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, రిపబ్లిక్ మూవీని బాయ్ కాట్ చేస్తున్నామని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ సినిమాపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం ఒక విధంగా సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే రిపబ్లిక్ సినిమా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయింది. తెలంగాణ లో మొత్తంగా 215 థియేటర్లలో ఈ సినిమా విడుదలవ్వగా.. ఆంధ్రప్రదేశ్లో 380 థియేటర్స్ లలో రిపబ్లిక్ సినిమా భారీ స్థాయిలో విడుదల అయింది. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో కలిపి 600 థియేటర్లలో విడుదలవ్వగా.. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 740 కి పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.


Next Story