మళ్ళీ యాక్టివ్ అయిన సాధినేని యామిని

బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ మళ్లీ యాక్టివ్ అయ్యారు.

By Medi Samrat  Published on  11 Nov 2023 3:45 PM GMT
మళ్ళీ యాక్టివ్ అయిన సాధినేని యామిని

బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ మళ్లీ యాక్టివ్ అయ్యారు. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దోపిడీలు చేస్తూ.. నీతులు చెబుతున్న వైసీపీ నేతలు ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని అన్నారు. ఆంధప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గురించి మీరు మాట్లాడటానికి సిగ్గుండాలన్నారు. వైసీపీ నేతలంటేనే డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరని.. సీఎంజగన్మోహన్ రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే మా అధ్యక్షురాలిపై విమర్శలు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. దగ్గుపాటి పురందేశ్వరిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై యామిని ఫైర్ అయ్యారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు మీ పేర్లు పెట్టుకున్నారు..అదే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తుంటే ఓర్చుకోలేక దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు యామిని శర్మ. చెత్త నుంచి మరుగుదొడ్ల వరకు పన్నులు వసూళ్లూ చేస్తు ప్రజల్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని పాలనతో దేశంలోనే రాష్ట్రం పేరు చెడగొట్టారని విమర్శించారు.

Next Story