ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. నేడు ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.7,500
ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్‌న్యూస్. నేడు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
By అంజి Published on 1 Jun 2023 2:00 AM GMTఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. నేడు ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.7,500
ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్‌న్యూస్. నేడు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి విడత నిధులు నేడు లబ్దిదారుల అకౌంట్లలో జమ అవుతాయి. రైతులు ఒక్కొక్కరికి ఏటా రూ. 13,500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు రైతు భరోసా అందించారు. ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండలో వరుసగా ఐదో ఏడాది, మొదటి విడతా వైయస్సార్ రైతుభరోసా– పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
ఈ ఏడాది మొదటి విడతలో ఒక్కొక్కరికి రూ. 7,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 52,30,939 మంది రైతుల ఖాతాల్లో రూ. 3,923.21 కోట్ల రైతు భరోసా సాయాన్ని సీఎం వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా సాయం కింద రూ.5,500 రైతన్నల ఖాతాల్లో జమ చేస్తారు. పీఎం కిసాన్ ద్వారా రావాల్సిన రూ. 2,000 కూడా ఆ నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా కింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం అందిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. నేడు అందిస్తున్న సాయం రూ. 3,923 కోట్లతో కలిపి నాలుగేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ ద్వారా రూ. 30,985 కోట్లు అందించారు.