వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలుపెట్టిన రోజా
Roja Starts Work From Home. వైసీపీ నాయకురాలు రోజా సెల్వమణి పాలిటిక్స్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం
By Medi Samrat Published on 17 April 2021 5:43 PM ISTవైసీపీ నాయకురాలు రోజా సెల్వమణి పాలిటిక్స్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్నా కూడా ఆమె అందులో యాక్టివ్ గా పాల్గొనలేకపోవడానికి కారణం ఆమెకు ఇటీవల శస్త్ర చికిత్స జరగడమే..! రోజా సెల్వమణి ఇటీవల చెన్నైలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె తన నివాసంలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోజా చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్నారు. రెండు మేజర్ సర్జరీలు చేసుకొని చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన రోజా డిశ్చార్జి అయ్యారు. జనరల్ చెకప్ కోసం మార్చి 24న ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని సూచించగా.. ఆమెకు రెండు మేజర్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. సర్జరీల తర్వాత 7 వారాల పాటు బెడ్‌రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె ఇంటికే పరిమితం అయ్యారు.
అయితే ఆమె ఇంటి నుండే పని చేయడం మొదలుపెట్టారు. అదే వర్క్ ఫ్రమ్ హోమ్..! రోజా సెల్వమణి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభించారు. ఇంటి నుంచి ఆమె అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా తన నియోజకవర్గంలోని అధికారులు, మున్సిపల్ ఛైర్మన్లు, ఇతర నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం చెన్నైలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నానని అధికారులకు తెలిపారు. ఇంటి నుంచి అధికారిక పనులు చక్కబెడుతున్నానని.. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత నగిరి నియోజకవర్గంలో పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకుంటామని ఆమె చెప్పుకొచ్చారు.