తప్పుడు ప్రచారం మానుకోకపోతే.. ప్రజలే గుణపాఠం చెబుతారు

Roja lambasts yellow media for spreading fake news. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా శనివారం ఎల్లో మీడియాపై

By Medi Samrat
Published on : 11 Jun 2022 9:45 AM

తప్పుడు ప్రచారం మానుకోకపోతే.. ప్రజలే గుణపాఠం చెబుతారు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా శనివారం ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను గన్‌మెన్‌తో కలిసి మహద్వారానికి వెళ్లినట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. గన్ మెన్ లేకుండా మహాద్వారం మీదుగా తాను ఒంటరిగా వెళ్లినట్లు రోజా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఆలయాలను కూల్చివేయాలని ఆదేశించినప్పుడు ఎల్లో మీడియా ఎక్కడుంద‌ని రోజా ప్రశ్నించారు.

చంద్రబాబు చాలా సందర్భాల్లో బూట్లు, చెప్పులు ధరించి పూజలు చేశారని రోజా గుర్తు చేశారు. ఈ విషయాలన్నీ జరిగినప్పుడు ఎల్లో మీడియా గుడ్డిలో కూరుకుపోయిందని మంత్రి అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు వార్తలను ప్రచారం చేయడం మానుకోకపోతే.. ఎల్లో మీడియాకు, దాని వెనుక ఉన్న వ్యక్తులకు ప్రజలే గుణపాఠం చెబుతారని రోజా అన్నారు.










Next Story