ఓ వైపు ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనలు.. మరో వైపు రోజా కీలక వ్యాఖ్యలు

Roja Comments On NTR. కొద్దిరోజుల కిందట అసెంబ్లీలో జరిగిన ఘటనల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

By Medi Samrat  Published on  29 Nov 2021 10:47 AM GMT
ఓ వైపు ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనలు.. మరో వైపు రోజా కీలక వ్యాఖ్యలు

కొద్దిరోజుల కిందట అసెంబ్లీలో జరిగిన ఘటనల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన భార్యను అవమానించారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. అయితే.. తాము ఆడవారిని అవమానిస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, చంద్రబాబు అనవసరమైన డ్రామాకు తెరలేపారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మేన‌త్త‌కు జ‌రిగిన అవ‌మానంపై జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగ్గా లేద‌ని టీడీపీ నేత‌లు వ‌రుస‌గా ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పలువురు టీడీపీ ముఖ్య నాయకులు ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల వ్యాఖ్యల పట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా చిత్తూరు జిల్లా కుప్పంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ధర్నాకు దిగారు. త‌మ అభిమాన న‌టుడు ఎన్టీఆర్‌పై టీడీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ అభిమానులు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేస్తే ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు. జూనియర్‌ అభిమానులు కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి ఎస్‌ఆర్‌ఎం సినిమా థియేటర్‌ వరకు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో ఎస్‌ఆర్‌ఎం థియేటర్‌ ఎదుట జూనియర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ వెనుక వైసీపీ నేతలు ఉన్నాయనే ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని అన్నారు. ఆయన తమ పార్టీలోకి వస్తారని ఆశిస్తే తాము స్వాగతిస్తామని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను 2014 ఎన్నికలకు ముందు వరకూ తెగ వాడుకున్నారని.. ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుండి ఎన్టీఆర్ ను, హరి కృష్ణను పక్కకు పెట్టడం మొదలు పెట్టారని ఆరోపించారు. ఎక్కడ నారా లోకేష్ ఎదుగుదలకు జూనియర్ ఎన్టీఆర్ అడ్డం వస్తారోనని ఆయనను సైడ్ చేశారని రోజా చెప్పుకొచ్చారు.


Next Story