సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి

ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో శ‌నివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  21 Dec 2024 9:30 AM IST
సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి

ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో శ‌నివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మడకశిర మండల కేంద్రం బుళ్లసముద్రం స‌మీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని.. మినీ వ్యాన్‌ వేగంగా ఢీకొట్టింది. దీంతో మినీ వ్యాన్‌లో ఉన్న నలుగురు మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మ‌రో పది మందికిపైగా గాయపడ్డారు. మృతులను గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా గుర్తించారు. వీరు తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంద‌ని స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను హిందూపురం, బెంగళూరు ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవ‌ర్ స‌హా అత్వార్, ప్రేమ్ కుమార్, రత్నమ్మ అనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story