బ్రేకింగ్: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident In Kurnool District. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  30 Nov 2022 6:06 PM IST
బ్రేకింగ్: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని కోడుమూరు నుంచి కర్నూలుకు వెళ్తుండగా కారు కోడుమూరు వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి గుంతలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుల్లో మిడుతూరు మండలం అలగనూరు వాసులైన తండ్రీ కుమారుడు యలమరాజు, నారాయణ, కర్నూలు జిల్లా తొగర్పేడు వాసి వెంకటస్వామిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను తరలించారు.

ఆటో, బైక్ ఢీ :

కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం హుసేనాపురంలో రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. బుగ్గ రామేశ్వర పాఠశాల దగ్గర జాతీయ రహదారిపై ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిది నంద్యాల అని భావిస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story