ఎవరు చప్పట్లు కొట్టలేదో ఒకసారి చూడండి : ఆర్జీవీ
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యిన చంద్రబాబు ప్రస్తుతం
By Medi Samrat Published on 14 Sept 2023 6:06 PM ISTఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ములాఖత్ అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజల భవిష్యత్ కోసం టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయిని చెప్పారు. బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు పవన్. వైసీపీకి అనుకూలంగా ఉంటోన్న క్రిమినల్స్‌ను వదలబోమని ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు.
See WHO is NOT CLAPPING pic.twitter.com/IW6Hyyd3R6
— Ram Gopal Varma (@RGVzoomin) September 14, 2023
ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పవన్ కళ్యాణ్ ప్రకటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ఆ సమయంలో చప్పట్లు ఎవరు కొట్టలేదో చూడాలని కోరారు. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేయగా.. నారా లోకేష్ మాత్రం చప్పట్లు కొట్టలేదు. ఈ విషయాన్ని ఆర్జీవీ ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. కొందరు లోకేష్ కు మద్దతుగా.. మరికొందరు లోకేష్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.