హోం గార్డుల స్వరాష్ట్రాల బదిలీ సమస్యను పరిష్కరించండి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం సచివాలయంలో కలిశారు.

By Medi Samrat
Published on : 28 Aug 2025 9:15 PM IST

హోం గార్డుల స్వరాష్ట్రాల బదిలీ సమస్యను పరిష్కరించండి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం సచివాలయంలో కలిశారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులుగా నియామకం పొందిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో ఏపీ స్థానికత, ఏపీలో తెలంగాణ స్థానికత కలిగిన హోం గార్డులు పనిచేస్తున్నారని సీఎంకు వివరించారు. వీరు ఇంకా వారి వారి స్వరాష్ట్రాలకు బదిలీ కాకపోవడంతో చాలా అవకాశాలు కొల్పోతున్నారని రామకృష్ణ చెప్పారు. కానిస్టేబుల్స్ సెలెక్షన్స్ విషయంలో వీరికి రెండు రాష్ట్రాల్లోనూ సాంకేతిక సమస్యలు ఎదురువుతున్నాయని చెప్పారు. వీరిని వారి స్వరాష్ట్రాలకు బదిలీ చేయించేలా చొరవ తీసుకోవాలని సీఎంను కోరారు. ఇక రాష్ట్రంలో యూరియాతోపాటు.. రైతులకు అవసరమైన ఎరువులనూ అందుబాటులోకి తీసుకురావాలని వినతి సీఎంకు వినతి పత్రం సమర్పించారు. సీఎంను కలిసిన వారిలో ఆ పార్టీ నేత ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఉన్నారు.

Next Story