రాజకీయాలకు రాజీనామా.. వెంటనే విదేశీ టూర్‌కు పిటిషన్.. ఇంట్రెస్టింగ్‌గా వీఎస్‌ఆర్ ఇష్యూ
రాజకీయాలకు గుడ్ బై చెబుతూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
By Knakam Karthik Published on 25 Jan 2025 11:13 AM ISTరాజకీయాలకు రాజీనామా.. వెంటనే విదేశీ టూర్‌కు పిటిషన్.. ఇంట్రెస్టింగ్‌గా వీఎస్‌ఆర్ ఇష్యూ
రాజకీయాలకు గుడ్ బై చెబుతూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పాలిటిక్స్ నుంచి పర్మినెంట్‌గా నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన నిన్న ఎక్స్ వేదికగా ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడంలేదని క్లారిటీ ఇచ్చారు. పాలిటిక్స్ నుంచి వైదొలగాలనుకున్న నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమన్న ఆయన ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరూ కూడా తనను ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు.
అయితే పాలిటిక్స్‌కు గుడ్ బై చెబుతూ పోస్టు పెట్టిన కొద్ది గంటల్లోనే.. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు విజయసాయిరెడ్డి. నార్వే, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు అంటే నెల రోజుల పాటు విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయసాయి పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు.. సీబీఐ స్పందన కోసం తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
విజయసాయి రాజీనామాతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఆయన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. రాజకీయాలకు దూరంగా భవిష్యత్తులో తాను వ్యవసాయం మాత్రమే చేస్తానంటూ విజయసాయి ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు, ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. విజయసాయి రాజీనామాపై అటు టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హాట్ కామెంట్స్ చేశారు. విజయసాయి అప్రూపవర్‌గా మారడం ఖాయమన్న ఆయన, జగన్ డిస్ క్వాలిపై అవ్వడం కూడా ఖాయమని జోస్యం చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో బైపోల్ అనివార్యం కాబోతుందని అనుమానం వ్యక్తం చేశారు.