అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది.

By Medi Samrat
Published on : 7 Nov 2023 2:17 PM IST

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని సీఐడీని ఆదేశించింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని, ఆ గడువు ముగిసేంత వరకు ఆయనను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబోమని తెలిపారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన హైకోర్టు, అరెస్ట్ చేయవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది.

చంద్రబాబుకు ఇప్పటికే అనారోగ్య కారణాలతో బెయిల్‌పై ఉన్నందున విచారణ వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌ సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు నవంబర్ 28వరకు బెయిల్‌ గడువు ఉంది.

Next Story