అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నమ్మించి సీఎం జగన్ గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీనీ, పదవిని వదులుకుని వచ్చామన్నారు. ఇక గతంలో మంత్రి పదవి ఇస్తా అన్నారు. పదవి ఇవ్వలేదు. సర్వే పేరుతో టికెట్ లేదని చెప్పారు. రాయదుర్గం నుండి నేను.. కళ్యాణదుర్గం నుంచి తాన భార్య పోటీలో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పోటీ చేసి తీరుతామని అన్నారు. సీఎం జగన్ తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని.. ఇంతకంటే అవమానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ ప్రకటించారు.
శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి రామచంద్రారెడ్డి వచ్చారు. సీఎంవో నుంచి వచ్చి తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. జగన్ ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చానని.. ఇన్నేళ్లూ జగన్ ఏం చేబితే అది అదే చేశామని చెప్పారు. ఇప్పుడు పార్టీని వీడాల్సి వచ్చిందని, ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉందన్నారు.