రామోజీ రావు అంత్యక్రియలు అప్పుడే

ఈనాడు గ్రూప్స్ అధినేత, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు

By Medi Samrat  Published on  8 Jun 2024 11:37 AM IST
రామోజీ రావు అంత్యక్రియలు అప్పుడే

ఈనాడు గ్రూప్స్ అధినేత, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశాలు వచ్చాయి

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆయన రామోజీ మరణంపై సంతాపం తెలిపారు. "రామోజీ రావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని వైఎస్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Next Story