భయంతో చలి జ్వరం వచ్చింది.. 'చలో విజయవాడ'పై ఆర్జీవీ వరుస ట్వీట్లు
Ramgopal Varma series of tweets on Chalo Vijayawada. ఏపీ సర్కార్ ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా గురువారం నాడు ప్రభుత్వ ఉద్యోగులు 'చలో విజయవాడ' కార్యక్రమం నిర్వహించారు.
By అంజి Published on 4 Feb 2022 2:52 AM GMTఏపీ సర్కార్ ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా గురువారం నాడు ప్రభుత్వ ఉద్యోగులు 'చలో విజయవాడ' కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ముందే ప్రకటించిన.. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడ నగరానికి చేరుకుని తమ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమం ఊహించిన దాని కంటే ఎక్కువ విజయవంతమైనది. తాజాగా 'చలో విజయవాడ' కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ''ఏపీ ప్రభుత్వం సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది.'' అంటూ ట్వీట్ చేశారు.
ఆ తర్వాత ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం నాకు షాక్ ఇచ్చిందని..ఇలా ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా అంటూ సందేహం వ్యక్తం చేశారు. అలాగే నిరసన తెలుపుతున్న వారికి ఆర్జీవీ సలహా కూడా ఇచ్చారు. సందర్భానుసారంగా అరవడం వల్ల మౌనం పిరికితనం అవుతుందన్నారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు విజయవాడకు భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. జిల్లాల్లో పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నాలు చేసినా.. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
A P సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయం తో చలి జ్వరం వచ్చేసింది😳😳😳 pic.twitter.com/ImFu9oyciR
— Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2022
It is a shock to me that so many lakhs of government employees can come on to the roads to protest against their own government..I doubt if this ever happened anywhere in the world ever pic.twitter.com/n4adBosbca
— Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2022
My single point advise to AP protestors is that Silence becomes cowardice when occasion demands shouting!
— Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2022