సీఎం జగన్ ను కలిసిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma Meet With CM Jagan. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కలిశారు.

By Medi Samrat  Published on  26 Oct 2022 6:15 PM IST
సీఎం జగన్ ను కలిసిన రామ్ గోపాల్ వర్మ
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కలిశారు. జగన్ నివాసానికి వెళ్లిన రామ్ గోపాల్ వర్మ ఆయనతో భేటీ అయ్యారు. రామ్ గోపాల్ వర్మను ముఖ్యమంత్రి జగన్ విందుకు ఆహ్వానించారు. దాదాపు గంటన్నర పాటు ఇరువురు సమావేశం కొనసాగింది. జగన్ తో కలిసి భోజనం చేసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ అక్కడి నుంచి బయలుదేరారు. ఈ భేటీలో వారు తెలుగు సినీ పరిశ్రమ, కార్మికులు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. గతంలో సినిమా టికెట్ల వివాదం నేపథ్యంలో పేర్ని నానిని కలిసిన విషయం తెలిసిందే. అయితే తాజా ముఖ్యమంత్రితో భేటీ వెనకాల అసలు కారణం ఏంటన్న విషయంపై చర్చ జరుగుతోంది. క్యాంప్‌ ఆఫీస్‌ వర్గాల నుంచి మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాని నేపథ్యంలో ఈ భేటీ పూర్తిగా వర్మ వ్యక్తిగత విషయంగా తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మనే త్వరలో ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంది.


Next Story