ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు సమయం పట్టేట్టు ఉండడంతో మంగళవారం సిట్ విచారణకు హాజరవుతున్నానని రాజ్ కసిరెడ్డి స్వయంగా వెల్లడించారు. ఇంతలోనే ఏపీ పోలీసులు రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సిట్ పోలీసులు అతడిని హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. రాజ్ కసిరెడ్డి దుబాయ్ నుంచి హైదరాబాద్ రాగా, పోలీసులు పక్కా సమాచారంతో అతడిని పట్టుకున్నట్టు సమాచారం. ఏపీ పోలీసులు రాజ్ కసిరెడ్డిని విజయవాడ తీసుకురానున్నారు.