11న మ‌రో అల్పపీడనం.. ఏపీకీ వ‌ర్ష సూచ‌న‌

Rain Alert For AP. నిన్నటి తీవ్ర అల్పపీడనం బలహీనపడి ఆంధ్రప్రదేశ్ నుండి దూరంగా వెళ్లిపోయింది.

By Medi Samrat  Published on  8 Sep 2021 9:26 AM GMT
11న మ‌రో అల్పపీడనం.. ఏపీకీ వ‌ర్ష సూచ‌న‌

నిన్నటి తీవ్ర అల్పపీడనం బలహీనపడి ఆంధ్రప్రదేశ్ నుండి దూరంగా వెళ్లిపోయింది. ఇక ఈ రోజు షీర్ జోన్ (ద్రోణి) 20°N అక్షాంశము వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 కీమీ నుండి 5.8 కీమీ ఎత్తుల మధ్య కొనసాగుతున్నది. ఈ నెల 11వ తేదీన ఉత్తర బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉంది. వీటి ప్రభావం వల‌న ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజులు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. వ‌చ్చే మూడు రోజులు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాల‌కులు తెలిపారు.


Next Story