ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల్లో గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా నేడు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలలో ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది.

ఇక దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఈ రోజు రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే.. రాయల‌సీమలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.


సామ్రాట్

Next Story