ఏపీకి వర్ష సూచన
Rain Alert For AP. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ
By Medi Samrat Published on 21 July 2021 10:54 AM GMT
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్. స్టెల్లా తెలిపారు. ఈనెల 23న వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..?
బుధవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.