కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసిన డాక్టర్ రఘువీరారెడ్డి.. ఇప్పుడు రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టారు. తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. రైతుగా ట్రాక్టర్‌లో పొలం దున్నుతూ రఘువీరా తన అభిమానులను ఇటీవల ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా మనవరాలు సమైరాతో ఆడుకోవడం లేదని ఇలా స్థంభానికి కట్టేసిందని, ఆడుకోవడానికి తాను ఇంట్లోనే ఉండాలని డిమాండ్ చేసిందంటూ రఘువీరా ట్వీట్ చేశారు.
తనను కట్టిపడేసిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. ఆడుకోవడానికి తాత రఘువీరారెడ్డి తన సమయాన్ని కేటాయించడం లేదని మనవరాలు చేసిన పనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తాత రఘువీరాను కట్టేసి మరీ ఆడుకోవాలని డిమాండ్ చేయడం భలేగా ఉందని, ఈ దృశ్యం హృదయాన్ని కట్టిపడేసేలా ఉందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రఘువీరా మంత్రిగా పని చేశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ చేశారు. ఏపీ ఎన్నికల్లో బైక్‌పై వెళ్లి ఓటేసిన రఘువీరా అందరిని ఆకర్షించారు. రఘువీరా స్వస్థలం అనంతపురం జిల్లా నీలకంఠాపుం.