ఏ మాత్రం సైలెంట్ అవ్వని ఆర్ఆర్ఆర్

Raghurama Raju Seeks All Party Support. ఎంపీ రఘు రామ కృష్ణ రాజు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అన్ని మార్గాలను

By Medi Samrat  Published on  3 Jun 2021 3:09 PM GMT
ఏ మాత్రం సైలెంట్ అవ్వని ఆర్ఆర్ఆర్

ఎంపీ రఘు రామ కృష్ణ రాజు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి.. తన అరెస్టుకు దారితీసిన అంశాలను చెప్పిన సంగతి తెలిసిందే..! ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ తాను సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వలనే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని స్పీకర్‌కు చెప్పారు రఘురామ. తన కేసులో ముఖ్యమంత్రి జగన్, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్, ఏఎస్‌పీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని, తనను తీవ్రంగా గాయపరిచారని స్పీకర్‌కు తెలిపారు. రఘురామ కృష్ణరాజు చెప్పినవన్నీ విన్న స్పీకర్ ఓం బిర్లా విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు కూడా రఘురామ లేఖలు రాశారు. ప్రస్తుతం పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో సభ్యుడైన రఘురామ.. తన సహచరులకు లేఖలు రాశారు. తన అరెస్ట్‌, అనంతర పరిణామాలను వివరిస్తూ రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు. దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు. రఘురామ రాసిన లేఖకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మణికం ఠాకూర్ నుండి మద్దతు లభించింది. ''సిద్ధాంతపరంగా నేను రఘురామతో విభేదించవచ్చు, కానీ ఒక సహచర ఎంపీగా ఆయనకు జరిగిన ఘటనలన్ని చూసి షాకయ్యాను. ఏపీ పోలీసుల తీరు నిజంగా ఉన్మాదంగా, క్రూరంగా ఉంది. ఒక ఎంపీ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించారంటే సామాన్య రాజకీయ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఏపీలో హిట్లర్ రాజ్యం నడుస్తోందా?'' అని మణికం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story