సీఐడీ అడిషనల్ డీజీకి ఎంపీ రఘురామ లీగల్ నోటీసు
Raghu rama krishnam raju Sent Legal Notice To CID DG. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు వార్తల్లో నిలిచారు. సీఐడీ అడిషనల్
By Medi Samrat Published on 5 Jun 2021 2:55 PM ISTవైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు వార్తల్లో నిలిచారు. సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లీగల్ నోటీసు ఇచ్చారు. తన అరెస్ట్ సమయంలో సీఐడీ పోలీసులు తీసుకున్న ఐ-ఫోన్‌ను తిరిగి ఇవ్వాలంటూ నోటీసులో ఎంపీ పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఐ-ఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదన్న విషయాన్ని కూడా నోటీసులో ఆయన చెప్పుకొచ్చారు. ఫోన్‌లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్‌లోనే ఉందని.. పార్లమెంట్ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసులో తెలిపారు. ఫోన్ తిరిగి ఇవ్వని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కూడా నోటీసులో రఘురామ పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ ఇంతవరకూ స్పందించలేదు.
ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ సీఐడీ పోలీసులు ఇటీవల ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారు. తొలుత గుంటూరు జిల్లా జైలు తరలించారు. అయితే.. తనను సీఐడీ పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారని పేర్కొంటూ ఎంపీ నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించి.. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎంపీని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ముగ్గురు డాక్టర్లలతో కూడిన బృందం ఆయన్ను పరీక్షించింది. ఆ తరువాత బెయిల్, వైద్య పరీక్షల నివేదికలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనంతరం ఆయనకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.