మరో ఆరు నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: మంత్రి లోకేశ్

దేశంలో దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు

By Knakam Karthik
Published on : 8 July 2025 1:03 PM IST

Andrapradesh, Amaravati, Quantum Valley, Minister Lokesh

మరో ఆరు నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: మంత్రి లోకేశ్

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఏపీ ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశంలో దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం. టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టి వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ఆరు నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతోంది. ఇది భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ ఛేంజర్ గా నిలుస్తుంది..అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

మరోవైపు విశాఖ మహానగరం ఐటీ హబ్‌గా తయారవుతోంది. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు అందజేస్తున్నాం. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.

Next Story