Viral Video : ఒంటి మీద కొండచిలువ పాకుతున్నా ద‌ర్జాగా ఉన్న మందుబాబు..!

ఆంధ్రప్రదేశ్ (ఏపీ)లోని నంద్యాల జిల్లాలో ఓ కొండచిలువ మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మీద‌కు ఎక్కింది

By Medi Samrat  Published on  15 Oct 2024 5:39 PM IST
Viral Video : ఒంటి మీద కొండచిలువ పాకుతున్నా ద‌ర్జాగా ఉన్న మందుబాబు..!

ఆంధ్రప్రదేశ్ (ఏపీ)లోని నంద్యాల జిల్లాలో ఓ కొండచిలువ మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మీద‌కు ఎక్కింది. అవుకు మండలం సింగ‌పల్లి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యింది.

ట్రక్ డ్రైవర్‌గా ప‌నిచేసే వ్యక్తి మద్యం మత్తులో బెంచ్‌పై కూర్చొని కనిపించాడు. ఇంటికి వెళ్లలేక బెంచ్‌పై కూర్చున్న ఆ వ్యక్తిని కూడా స్థానికులు గమనించారు. పొదల్లోంచి బయటకు వ‌చ్చిన ఆ పాము క్రమంగా మందుబాబు మెడకు చుట్టుకుంది. అయితే మ‌త్తులో ఉన్న అత‌డు మాత్రం దానితో ఆట‌లాడుతున్నాడు. ప‌క్క‌నున్న వాళ్లు వారిస్తున్నా వారిపైనే సీరియ‌స్ అవుతున్నాడు. అయితే.. చివ‌రికి కట్టెల సాయంతో పామును పక్కకు లాగడం పెను ప్ర‌మాదం త‌ప్పింది.

Next Story