సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని బాడ్మింటన్ సెన్సేషన్ పీవీ సింధూ ఆదివారం దర్శించుకున్నారు. తన తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమెను.. ఈ సారి ఒలింపిక్స్ లో బంగారు పథకం తీసుకురావాలని అర్చకులు ఆశీర్వదించారు. ముందుగా సింధూకు ఆలయ అధికారులు స్వాగతం పలకగా.. అర్చకులు వేద ఆశీర్వచనంతో పాటు ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆమెను సత్కరించారు. సింహాచలం క్షేత్ర మహత్స్యాన్ని, స్వామివారి వైభవాన్ని పీవీ సింధుకు అర్చకులు, అధికారులు వివరించి చెప్పారు. ఈ సందర్భంగా రెండు వరుస ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన తొలి ఇండియన్ గా రికార్డు సృష్టించిన సింధూ.. మూడోసారి మెడల్ సాధిస్తానన్నారు.
ఇదిలావుంటే.. వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పీవీ సింధుని మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ఆగస్ట్ 20వ తేదీన తమ ఇంటిలో ఘనంగా సత్కరించారు. ఇందుకు సంబంధించి ''దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.