ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకున్న సింధు.. ఈ సారి స్వర్ణం సాధించాలి

PV Sindhu Visit Durgamma Temple. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధు భార‌త్‌కు చేరుకున్న విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on  6 Aug 2021 5:31 AM GMT
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకున్న సింధు.. ఈ సారి స్వర్ణం సాధించాలి

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధు భార‌త్‌కు చేరుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో ఆమెకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అయితే.. శుక్ర‌వారం ఉద‌యం పీవీ సిందు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆలయ అధికారులు సింధుకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆల‌యంలో సింధు కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు సింధుకి వేదాశీర్వచనం చేశారు.

అనంత‌రం ఆలయ ఈఓ భ్రమరాంబ అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని సింధుకి బ‌హుక‌రించారు. ఈ సంద‌ర్భంగా సింధు మాట్లాడుతూ.. టోర్నమెంట్ కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చానని.. ప‌త‌కం సాధించిన అనంత‌రం అమ్మ‌వారి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉందని.. 2024 ఒలింపిక్స్‌లో కూడా ఆడాలని.. ఈ సారి స్వర్ణం సాధించాలని సింధు అన్నారు. ఇదిలావుంటే.. ఈ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినేట్ భేటీ కానుంది. ఈ భేటీలో కాంస్య ప‌త‌కం సాధించిన‌ పీవీ సింధుకు అభినందనలు తెలియచేయటంతో పాటు ప్రోత్సాహకాలు ప్రకటించే అంశంపై కూడా చర్చించనున్నట్లు స‌మాచారం.


Next Story