వైసీపీకి ఓటు వేస్తే అరాచకాలను ప్రోత్సహించినట్లే : పురందేశ్వరి

Purandeswari Fires On YSRCP Govt. వైసీపీకి ఓటు వేస్తే అరాచకాలను ప్రోత్సహించినట్లేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ

By Medi Samrat  Published on  26 Oct 2021 8:47 AM GMT
వైసీపీకి ఓటు వేస్తే అరాచకాలను ప్రోత్సహించినట్లే : పురందేశ్వరి

వైసీపీకి ఓటు వేస్తే అరాచకాలను ప్రోత్సహించినట్లేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ నేత ద‌గ్గుబాటి పురందేశ్వరి అన్నారు. క‌డ‌ప జిల్లా కమ్మవారిపల్లెలోని రామాలయంలో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మంగ‌ళ‌వారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను సైతం దారి మళ్ళించారని అన్నారు. పులివెందుల అభివృద్ధి.. బద్వేల్ లో ఎందుకు కనిపించద‌ని ఆమె ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు, అక్రమాలే తప్ప అభివృద్ధి శూన్యమ‌ని ఫైర్ అయ్యారు. బెదిరింపులు, భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలని వైసీపీ చూస్తుంద‌ని.. ఎంత మందిని బెదిరింపులకు గురిచేసి లోబర్చుకున్నా అదిరేది లేదు.. బెదిరేది లేదని అని అన్నారు.

అవీనీతిపరులైన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని.. నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు. పొరుగు జిల్లా వాసుల కోసం సాగు నీరు, తాగు నీరు ను త్యాగం చేసిన బద్వేల్ ప్రాంత వాసుల ఇబ్బందులు కనపడటం లేదా అని ప్ర‌శ్నించారు. కేంద్ర బలగాలతోనే ఎన్నికలు జరుగుతాయని.. బద్వేల్ ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అభివృద్ధి జరగాలంటే వైసీపీ అభ్యర్థి ని ఓడించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు.


Next Story