టీడీపీకి ప‌నిచేయ‌న‌ని పీకే చెప్పేశారా..?

టీడీపీకి ప్రశాంత్‌ కిషోర్‌ షాక్ ఇచ్చారు. నెలరోజుల కిందట చంద్రబాబుతో ప్రశాంత్‌ కిషోర్‌ సమావేశమ‌య్యారు.

By Medi Samrat  Published on  23 Jan 2024 6:26 PM IST
టీడీపీకి ప‌నిచేయ‌న‌ని పీకే చెప్పేశారా..?

టీడీపీకి ప్రశాంత్‌ కిషోర్‌ షాక్ ఇచ్చారు. నెలరోజుల కిందట చంద్రబాబుతో ప్రశాంత్‌ కిషోర్‌ సమావేశమ‌య్యారు. అప్ప‌ట్లో వీరిద్ద‌రి భేటీపై చాలా పెద్ద చ‌ర్చ జ‌రిగింది. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌తో స‌హా ప్రశాంత్‌ కిషోర్‌ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లి మ‌రీ చంద్ర‌బాబును క‌లిశారు. ఆ భేటీపై ఇప్పుడు క్లారిటీ వ‌చ్చింద‌ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. టీడీపీతో కలిసి పనిచేయడం లేదని ప్ర‌శాంత్ కిషోర్‌ క్లారిటీ ఇచ్చార‌నేది వార్త‌ల సారాంశం.

ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేయమని చంద్రబాబు ప్ర‌శాంత్ కిషోర్‌ను అడిగిన‌ట్లు.. ఆ పని వదిలేశానని.. ఇప్పుడు ఆ పని చేయలేనని అత‌డు చెప్పిన‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. అయితే.. ఇద్దరి కామన్‌ ఫ్రెండ్‌ ఫోర్స్‌ చేయడం వల్లే చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్లిన‌ట్లుగా కూడా పీకే స్ప‌ష్టం చేసిన‌ట్లు చెబుతున్నారు. టీడీపీకి పనిచేయనని ముందే అతనికి చెప్పాన‌ని.. చంద్రబాబును కలిసి ఆ విషయం చెప్పాలని కామన్‌ ఫ్రెండ్ కోర‌డంతో చంద్రబాబుని కలవాల్సివచ్చింద‌ని పీకే క్లారిటీ ఇచ్చిన‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

Next Story