ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పోతిన మహేష్ స‌వాల్‌

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి ఓటు వేయాలో విచక్షణగా ఆలోచించి ఓటు వేయాలని వైసీపీ నేత పోతిన మహేష్ సూచించారు.

By Medi Samrat  Published on  11 May 2024 2:59 PM IST
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పోతిన మహేష్ స‌వాల్‌

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి ఓటు వేయాలో విచక్షణగా ఆలోచించి ఓటు వేయాలని వైసీపీ నేత పోతిన మహేష్ సూచించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. 31లక్షలు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్ ది.. ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకుంది బాబు.. పాఠశాలలకు నాడు నేడుతో ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తే.. బాబు ఒక్క సంతకం తో పాఠశాలలు మూసేశాడు.. జగన్ తాను అమలు చేసిన 99 శాతం పథకాలు ప్రచారం చేస్తే.. బాబు అధికార పార్టీపై విషం చిమ్ముతూ ప్రచారం చేస్తున్నాడని ప్ర‌తిప‌క్షాన్ని దుయ్య‌బ‌ట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమలులో లేదు.. కానీ అమలులోకి వొచ్చింది అని చంద్ర‌బాబు చెపుతున్నాడు.. పవన్ కళ్యాణ్ కొన్న స్థలానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చారా.? జిరాక్స్ కాపీ ఇచ్చారా పవన్ చెప్పాలి.. పవన్ తీసుకొన్న డాక్యుమెంట్‌పై నా సవాల్ స్వీకరిస్తారా.? అని స‌వాల్ విసిరారు.

పోర్ట్ లు, పరిశ్రమలు, దుర్గమ్మ సాక్షిగా కట్టిన రిటైనింగ్ వాల్ కంటికి కనిపిస్తుందన్నారు. చంద్రబాబు కంటికి కాదు.. మైండ్ కి ఆపరేషన్ చేయాలన్నారు. విద్యా విధానం, వైద్య రంగాలపై కామెంట్స్ చేయలేరు.. అబద్ధాలు చెప్పడం కూటమి నేతల పొరపాటు కాదు.. చంద్రబాబు నైజం అన్నారు. సూపర్ సిక్స్ కాదు.. సూపర్ స్కామ్ అది.. స్కామ్ లో భాగస్వామ్యం కాము అని బీజేపీ దూరంగా ఉంది.. కనీసం ఫోటో కూడా వేయలేదు.. మోదీ, అమిత్ షా మ్యానిఫెస్టోపై ఒక్క మాట కూడా మాట్లాడ లేదు.. కారణం అమలు చేయడం సాధ్యం కాదు కాబ‌ట్టి.. అమరావతి రైతుల కోసం ర్యాలీ చేస్తానని చెప్పిన పవన్ ఎందుకు చేయలేదని ప్ర‌శ్నించారు.

ప్రత్యేక హోదా పాచిపోయిన లడ్డు అని చెప్పిన పవన్.. నేడు ఆ లడ్డు ఏ ఫ్రీజ్ లో నుండి తీసి ఇచ్చారో పవన్ చెప్పాలన్నారు. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయని పోటీ చేస్తున్న పవన్. టీడీపీ చుట్టూ తిరిగితున్నాడు కానీ కాపు నేతలను పట్టించు కోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగ గారి విగ్రహాలు కన్నీరు పెట్టుకొంటున్నాయి. హత్య చేసిన వాడు నివాళులు అర్పిస్తుంటే రంగ గారి విగ్రహాలు క్షోభిస్తున్నాయన్నారు.

Next Story