ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ 'హరి హర వీరమల్లు' సినిమాపై పోతిన మహేష్ సంచ‌ల‌న కామెంట్స్‌

జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ ముఖ్య‌నేత‌ నాదెండ్ల మనోహర్‌పై పోతిన మహేష్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ

By Medi Samrat  Published on  20 April 2024 7:02 PM IST
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ హరి హర వీరమల్లు సినిమాపై పోతిన మహేష్ సంచ‌ల‌న కామెంట్స్‌

జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ ముఖ్య‌నేత‌ నాదెండ్ల మనోహర్‌పై పోతిన మహేష్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీ జెండా, ఎజెండా ఎంటో పవన్ కల్యాణ్ చెప్పాలన్నారు. చంద్రబాబును సీఎంను చేయడం కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారా అని ప్ర‌శ్నించారు. కాపు యువతను, వీర మహిళలను, జన సైనికులను టీడీపీకి జెండా కూలీలుగా మార్చారని.. ఉమ్మడి పది జిల్లాలో జన సేన పార్టీ లేదన్నారు.

నిన్ను నమ్ముకున్న వాళ్ళని జెండా కూలీలుగా మార్చి ప్యాకేజ్ తీసుకున్నారని ఆరోపించారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసాకా ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో పవన్ కళ్యాణ్ చెప్పాలని అన్నారు. పవన్ కళ్యాణ్ తో చంద్ర బాబుతో మిలాకత్ అయ్యి పార్టీని తాకట్టు పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ ఆస్తుల వివరాలు బయట పెట్టకపోతే తాను బయట పెడతాన‌న్నారు. పార్టీ ఆస్తుల వివరాలను పవన్ కళ్యాణ్ ఎందుకు బయట పెట్టడం లేదని ప్ర‌శ్నించారు.

పార్టీ కోసం ఫండ్ సేకరించి ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. జన సేన పార్టీ కార్యాలయం స్థలం కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్ర‌శ్నించారు. పార్టీ కోసం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సేకరించిన నిధుల వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో అన్ని పార్టీలు పార్టీ నిధుల వివరాలు బయట పెట్టాయి.. పవన్ కళ్యాణ్ ఎందుకు బయట పెట్టడం లేదని ప్ర‌శ్నించారు. కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ఎన్నారైలు ఇచ్చిన నిధులు ఏమయ్యాయని ప్ర‌శ్నించారు. పార్టీ కౌలు రైతుల అకౌంట్ కు వచ్చిన విరాళాలు ఎన్ని అనే విష‌య‌మై బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

టీటీడీ వెంకన్నకు అందరూ భక్తులు విరాళాలు ఇస్తే పవన్ కళ్యాణ్ ఖాజా సమీపంలో ఉన్న దశావతారం వెంకన్న ఆలయానికి విరాళాలు ఎందుకు ఇస్తారు. పార్టీకి వచ్చిన విరాళాలు అన్ని ఏమయ్యాయని ప్ర‌శ్నించారు. హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఎవ్వరు.. హరిహర వీర మల్లు సినిమా ఎందుకు పూర్తి చేయడం లేదని ప్ర‌శ్నించారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం కోసం హరి హార వీరమ‌ల్లు సినిమాని అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ఇన్‌కం టాక్స్ డిపార్ట్ మెంట్ కు కంపైంట్ ఇచ్చారన్నారు. మీకు ఇంటిలిజెన్స్‌ అధికారులు చెప్పినట్లే మాకు ఇంటెలిజన్స్ అధికారులు చెప్తున్నారన్నారు. సినిమా ఇండస్ట్రీ మీపై ఆధారపడి బతుకుతుందని ఎలా చెప్పావ్. పవన్ కు ఉన్న బ్రాండ్ మాటలు చెప్పడం.. మోసం చేయడమ‌న్నారు.

అల్లు అర్జున్ గురించి ఏ రోజైనా పవన్ కళ్యాణ్ నాలుగు మంచి మాటలు ఏ రోజైనా చెప్పారా అని ప్ర‌శ్నించారు. మీ కుటుంబంలో బ్రాండ్ అంటే అల్లు అర్జున్ మాత్రమేన‌న్నారు. నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేసే వ్యక్తి అల్లు అర్జున్ అని కొనియాడారు. నమ్మిన వాళ్ళని మోసం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. చినిగిన లుంగీ, విరిగిన కర్ర, నాలుగు రంగులు పూసుకొని అల్లు అర్జున్ బ్రాండ్ క్రియేట్ చేశాడన్నారు. స్కిల్ లేని పవన్ కళ్యాణ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మాట్లాడతాడా అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే జనసేన పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం ఎంటి.. ఎన్నికల ముందే జన సేన పార్టీని టీడీపీలో విలీనం చేశారా అని ప్ర‌శ్నించారు.

నాదెండ్ల మనోహర్ కష్ట పడకుండా రాజకీయాలను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ 10 కోట్లు ఖర్చు పెట్టి స్పోర్ట్స్ కార్ కొనుగోలు చేశారు. హైదారాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ పార్కింగ్ సెల్లార్‌లో పార్క్ చేసి ఉంచారు. ఈ డబ్బులు ఏ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఇచ్చారో నాదెండ్ల మనోహర్ చెప్పాలన్నారు.

Next Story