దొంగలందరూ కలిసి సీఎం జగన్‌ని దించాలని చూస్తున్నారు: పోసాని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారని.. వాలంటీర్లు నిస్వార్థ సేవ చేస్తున్నా వారి మీద విషం చిమ్ముతూ వస్తున్నారని

By Medi Samrat  Published on  10 April 2024 6:30 PM IST
దొంగలందరూ కలిసి సీఎం జగన్‌ని దించాలని చూస్తున్నారు: పోసాని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారని.. వాలంటీర్లు నిస్వార్థ సేవ చేస్తున్నా వారి మీద విషం చిమ్ముతూ వస్తున్నారని ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు తలుపులు కొట్టేవారని అన్నాడు. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవాళ్లంటూ వాలంటీర్లపై దుష్ప్రచారం చేయించింది ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. వాలంటీర్లు లోకేశ్‌లా తాగుబోతు, తిరుగుబోతు, లోఫర్‌లు కాదన్నారు. వాలంటీర్ల సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారన్నారు.

తన రాజకీయ భవిష్యత్‌ కోసం చంద్రబాబు వంగావీటి రంగాను హత్య చేయించారు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనికిరారన్నారు పోసాని. వాలంటీర్లపై చంద్రబాబుది మొసలి కన్నీరని.. జయప్రద జీవితాన్ని నాశనం చేసింది చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామోజీరావుతో కలిసి లక్ష్మీ పార్వతి జీవితాన్ని నాశనం చేశాడన్నారు. దొంగలు అందరూ కలిసి సీఎం జగన్‌ని దించాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోసాని కృష్ణ మురళీ విమర్శించారు. పురంధేశ్వరి రాజకీయ అవకాశ వాది. బీజేపీలో ఉండి చంద్రబాబు కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ ఈ ప్రభుత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

Next Story