మీడియా ముందు పోసాని.. వాళ్లు బెదిరిస్తున్నారంటూ..!
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు.
By Medi Samrat Published on 4 Oct 2024 7:15 PM ISTసినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏబీఎన్ రాధాకృష్ణ అండ్‌కో బెదిరింపులకు పాల్పడుతున్నారని పోసాని కృష్ణ మురళి అన్నారు. సినిమా పరిశ్రమ కోసం తాను ప్రతిసారీ ముందుకు వచ్చానన్నారు. తాను ఎప్పుడూ న్యాయం వైపే ఉంటానని, నాగార్జున కుటుంబంపై జరిగిన ఈ మాటల దాడిని పరిశ్రమలో అందరూ ఖండించారన్నారు. కానీ బాలకృష్ణ కుటుంబం మాత్రం ఈ విషయంపై స్పందించలేదన్నారు. తన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు దూషించినా.. ఆయన కుటుంబాన్ని తానెప్పుడూ తిరిగి ఒక్క మాట కూడా అనలేదన్నారు.
నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ తనకు ముప్పై ఏళ్లుగా తెలుసునని.. ఎందుకు నోరు జారారో తెలియదన్నారు. నాగార్జున ఎవరికీ హానీ చేసే వ్యక్తి కాదని, అలాంటి మంచి వ్యక్తిపై మాట్లాడటం సరికాదన్నారు. రకుల్ ప్రీత్ సింగ్‌కు పెళ్లయి ముంబైలో ఉంటుందని, ఆమె గురించి మాట్లాడటం సరికాదన్నారు. అక్కినేని, కొండా సురేఖ ఘటనను కొంతమంది తనకు ఆపాదించి మాట్లాడుతున్నారని, పవన్ కళ్యాణ్ ను తాను తిట్టినట్లు నిరూపిస్తే.. లైవ్‌లో గొంతు కోసుకొని చనిపోతానని సవాల్ చేశారు.